Satyameva Jayate, a internationa concept movie has been started in Hyderabad.Gandhi's back is the main theme. This movie directed by EShwar Babu D. Music By Shashi Preetam.
#satyamevajayate1948
#nagineedu
#mahatmagandhi
#nathuramgadse
#tollywood
#latesttelugumovies
#movienews
ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం 'సత్యమేవ జయతే-1948". అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో ప్రారంభమైంది.
ఆలేఖ్య, రఘునందన్ (గాంధీ), ఆర్యవర్ధన్ రాజు (గాడ్సే), నాగినీడు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్), జెన్నీ (మొహ్మద్ ఆలీ జిన్నా), సమ్మెట గాంధీ (అబ్దుల్ గఫార్ ఖాన్), ఇంతియాజ్ (నెహ్రు) శరద్ దద్భావాలా (సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్), పి. శ్రీనివాస్, (అబుల్ కలాం ఆజాద్), తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. శరద్ దద్భావాలా క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు.